నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ
నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ తిరుపతి, 2018 డిసెంబరు 03: టిటిడి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదవల్లీ సమేత శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలకు సోమవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలలో భాగంగా డిసెంబరు 4వ తేదీ మంగళవారం […]
