తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.7.13 కోట్లు
తలనీలాల విక్రయం ద్వారా టిటిడి ఆదాయం రూ.7.13 కోట్లు తిరుమల, 2018 ఏప్రిల్ 05: కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే కోటానుకోటి భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలంలో టిటిడి రూ.7.13 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రతి నెలా మొదటి గురువారంనాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు పర్యవేక్షణలో తలనీలాల ఈవేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, […]
