ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభం
ఘనంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు ప్రారంభంతిరుపతి, మే 24, 2013: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, మూలవర్లకు అభిషేకం నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 గంటలకు అమ్మవారి ఉత్సవర్లను ఆలయం నుండి శుక్రవారపు తోటకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం అక్కడ స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పసుపు, కుంకుమ, పాలు, పెరుగు, తేనె, చందనం, పలురకాల పండ్లరసాలతో అభిషేకం చేశారు. […]
