JEO INSPECTS TTD GODOWNS _ టీటీడీ గోడౌన్లను తనిఖీ చేసిన జేఈవో శ్రీమతి సదా భార్గవి
టీటీడీ గోడౌన్లను తనిఖీ చేసిన జేఈవో శ్రీమతి సదా భార్గవి తిరుపతి, 2022 నవంబర్ 23: తిరుపతిలోని టీటీడీ గోడౌన్లను జేఈవో శ్రీమతి సదా భార్గవి బుధవారం తనిఖీ చేశారు. గోడౌన్లలోని బియ్యం, జీడిపప్పు, కందిపప్పు, వంట నూనెలు తదితర సరుకులను పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ, గోడౌన్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. అవసరమైన చోట గోడౌన్లకు మరమ్మత్తులు త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అనంతరం తల వెంట్రుకలు నిలువ చేసే గోడౌన్ తనిఖీ చేశారు. తల వెంట్రుకలను వేరు […]
