COLOURFUL FLOWER DECORATIONS ENTHRALLED DEVOTEES _ సిరులతల్లికి వేడుకగా స్నపనతిరుమంజనం
సిరులతల్లికి వేడుకగా స్నపనతిరుమంజనం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న పుష్పాలంకరణ తిరుపతి,2022 నవంబరు 21: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన సోమవారం అమ్మవారికి స్నపనతిరుమంజనం శోభాయమానంగా జరిగింది. మధ్యాహ్నం 12.30 నుండి 2.30 గంటల వరకు ఆలయంలోని శ్రీకృష్ణస్వామి ముఖ మండపంలో ప్రత్యేకంగా ఫల పుష్పాలతో రూపొందించిన మండపంలో శ్రీపాంచరాత్ర ఆగమశాస్త్రబద్ధంగా ఈ వేడుక వైభవంగా జరిగింది. కంకణభట్టర్ శ్రీ మణికంఠ బట్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ముందుగా […]
