శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో వైభవంగా ధ్వజారోహణం తిరుపతి, మే 17, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు శుక్రవారం ఉదయం 10.00 గంటలకు కర్కాటక లగ్నం నందు ధ్వజారోహణం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణల నడుమ ఈ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్.వి. సుబ్రమణ్యం మీడియాతో మాట్లాడుతూ సకలదేవతలను ఆహ్వానిస్తూ శ్రీ గోవిందరాజస్వామి వారి ధ్వజారోహణం దిగ్విజయంగా జరిగిందన్నారు. ఈ […]
