నవంబరు 19న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన
నవంబరు 19న శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో లక్ష కుంకుమార్చన తిరుపతి, 2022 నవంబరు 18: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా నవంబరు 19వ తేదీ శనివారం ఆలయంలో లక్ష కుంకుమార్చన వైభవంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన నిర్వహిస్తారు. అనంతరం అమ్మవారి ఉత్సవర్లను శ్రీకృష్ణస్వామి ముఖ మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారు. […]
