ఏప్రిల్ 9న శ్రీవారిమెట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం
ఏప్రిల్ 9న శ్రీవారిమెట్టు శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవం తిరుపతి, ఏప్రిల్,07, 2011: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనార్థం కాలినడకన కొండకు వెళ్ళే సోపాన మార్గాలలో ఒకటైన శ్రీవారిమెట్టు మార్గంలో వెలసియున్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం యొక్క ద్వితీయ వార్షికోత్సవం ఈ నెల 9వ తారీఖున జరుగనుంది. ఈ సందర్భాన్ని పురష్కరించుకొని తితిదే ఏప్రిల్ 9 అనగా శనివారం నాడు ఈ ఆలయంలో ప్రత్యేక పూజాకార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తితిదే వైఖానస ఆగమ సలహాదారు డాక్టర్ వేదాంతం విష్ణుభట్టాచార్యులు […]
