శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
శ్రీకపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు తిరుపతి, 2019 మార్చి 04: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీకామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున సుప్రభాతం అనంతరం 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 5.30 గంటలకు సర్వదర్శనం ప్రారంభమైంది. ఘనంగా రథోత్సవం(భోగితేరు) : బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 7.00 నుండి […]
