చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి చిద్విలాసం
చిన్నశేష వాహనంపై గోవిందరాజస్వామి చిద్విలాసం తిరుపతి, మే, 18, 2013: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన సోమవారం స్వామివారు దేవేరులతో కలసి చిన్నశేష వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు వాహనసేవ వైభవంగా జరిగింది. నాలుగు మాడ వీధుల్లో ఊరేగిన స్వామివారికి భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవ ముందు భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. కైవల్య జ్ఞాన ప్రాప్తిలో కుండలినీశక్తి జాగృతం అత్యంత […]
