శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి
శ్రీ కపిలేశ్వరాలయంలో ఘనంగా మహాశివరాత్రి తిరుపతి, మార్చి 10, 2013: తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీ కపిలేశ్వరస్వామి, శ్రీ కామాక్షి అమ్మవారిని దర్శించుకున్నారు.ఆదివారం తెల్లవారుజామున 2.00 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపారు. 2.30 గంటల నుండి 4.30 గంటల వరకు మహాన్యాస పూర్వక ఏకాథ రుద్రాభిషేకం నిర్వహించారు. ఉదయం 7.00 గంటల నుండి 9.00 గంటల వరకు రథోత్సవం(భోగితేరు) కన్నులపండువగా జరిగింది. […]
