తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి తిరుపతి, 2019 ఆగస్టు 07: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9వ తేదీ శుక్రవారం నిర్వహించనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆలయం వద్ద విశేషంగా విద్యుద్దీపాలంకరణ, పుష్పాలంకరణ చేపట్టారు. రూ.500/- చెల్లించి వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే భక్తులకు(ఇద్దరు) ఒక ఉత్తరియం, ఒక రవికె, రెండు లడ్డూలు, రెండు వడలు బహుమానంగా అందజేస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెల్లవారుజామున 1.30 గంటలకు […]