తెప్పపై గోవిందరాజుడి వైభవం
తెప్పపై గోవిందరాజుడి వైభవంతిరుపతి, ఫిబ్రవరి 23, 2013 : తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో ఐదో రోజైన శనివారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో కలిసి శ్రీ గోవిందరాజస్వామి తెప్పలపై విహరించి భక్తులకు అభయమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 10.30 నుండి 11.30 గంటల వరకు శ్రీ గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. […]
