KAPILESWARA RIDES PEDDASESHA _ శేష వాహనంపై కపిలేశ్వరుడు
శేష వాహనంపై కపిలేశ్వరుడు తిరుపతి, 2022 ఫిబ్రవరి 25: తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం రాత్రి శ్రీ కపిలేశ్వరస్వామివారు కామాక్షి అమ్మవారి సమేతంగా శేష వాహనంపై అభయమిచ్చారు. కోవిడ్ -19 నిబంధనల మేరకు వాహనసేవలు ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు – ఆ ఆదిశేషునిపై భూమండలం – ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన […]
