తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం
తెప్పపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి అభయం ఫిబ్రవరి 15, తిరుపతి 2019: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడో రోజు శుక్రవారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీకల్యాణవేంకటేశ్వరస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనంలతో అభిషేకం చేశారు. అనంతరం రాత్రి 7.00 నుండి 8.00 […]
