వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం
వైభవంగా శ్రీ కోదండరాముని తెప్పోత్సవాలు ప్రారంభం మార్చి 29, తిరుపతి, 2018: తిరుపతిలోని శ్రీకోదండరామస్వామివారి తెప్పోత్సవాలు గురువారం శ్రీరామచంద్ర పుష్కరిణిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 9.30 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరి నీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఊరేగింపు శ్రీగోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళ్లి […]
