మార్చి 22న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
మార్చి 22న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ మార్చి 20, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు మార్చి 22వ తేదీ గురువారం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో మార్చి 23 నుంచి 31వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. మార్చి 23న శుక్రవారం ఉదయం 8.15 నుండి 9.05 గంటల మధ్య మేష లగ్నంలో ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. […]
