ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
ఘనంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలుతిరుపతి, మే 29, 2013: శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు రెండో రోజు బుధవారం వైభవంగా జరిగాయి. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఉత్సవమూర్తులను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. మధ్యాహ్నం 2.00 నుండి 4.00 గంటల వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో అభిషేకం […]
