ఏప్రిల్ 8వ తేదీ నుండి ఆన్లైన్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టోకెన్లు
ఏప్రిల్ 8వ తేదీ నుండి ఆన్లైన్లో వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శనం టోకెన్లు తిరుమల, 2022 ఏప్రిల్ 07: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఏప్రిల్ నెల ప్రత్యేక దర్శన టోకెన్ల కోటాను ఏప్రిల్ 8వ తేదీన శుక్రవారం ఉదయం 11 గంటలకు టిటిడి ఆన్లైన్లో విడుదల చేయనుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య వల్ల ఏప్రిల్ 1వ తేదీకి బదులుగా ఏప్రిల్ 8వ తేదీకి దర్శన టోకెన్లను వాయిదా వేశారు. […]
