ఎస్వీ బాలమందిరంలో ‘సదాచారం’ తరగతులు ప్రారంభం
ఎస్వీ బాలమందిరంలో ‘సదాచారం’ తరగతులు ప్రారంభం తిరుపతి, ఏప్రిల్ 25, 2013: తితిదే ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర బాలమందిరం విద్యార్థులకు నెల రోజుల పాటు నిర్వహించనున్న సదాచారం శిక్షణ తరగతులు గురువారం ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఈ-2 శ్రీ సుధాకరరావు ప్రసంగిస్తూ విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సదాచారాలను పాటిస్తే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని సూచించారు. సదాచారాలను పాటించి మహాత్మునిగా ఎదిగిన గాంధీ గురించి విద్యార్థులకు వివరించారు. […]
