తిరుమలలో జనవరి 3న శ్రీవారి ప్రణయకలహోత్సవం
తిరుమలలో జనవరి 3న శ్రీవారి ప్రణయకలహోత్సవం తిరుమల, 2018, జనవరి 01శ్రీవేంకటేశ్వరస్వామివారు తన దేవేరులతో పాల్గొనే కలహ శృంగారభరితమైన ప్రణయ కలహోత్సవం జనవరి 3వ తేదీన తిరుమలలో వైభవంగా జరుగనుంది. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సాయంత్రం 4.00 గం||ల అనంతరం స్వామివారు, అమ్మవార్ల ఉత్సవమూర్తులు బంగారు పల్లకీలపై వేరువేరుగా వైభవోత్సవ మండపం నుండి ఊరేగింపుగా బయలుదేరి వరాహస్వామి ఆలయం చెంత ఒకరికొకరు ఎదురేగుతారు. ఇక్కడ అర్చకులు స్వామి, అమ్మవార్ల తరఫున వేరువేరుగా ఆళ్వారు దివ్యప్రబంధంలోని పాశురాలను స్తుతిస్తారు. […]
